మరో తుఫాన్ ముప్పు.. రైతులకు సూచనలు
AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడనుంది. మరింత బలపడి తుఫాన్‌గా మారితే సెన్‌యార్‌గా నామకరణం చేయనున్నారు. ఈ క్రమంలో రైతులను APSDMA అప్రమత్తం చేసింది. వరి కోతల వేళ వర్షాలు పడితే ధాన్యం దెబ్బతినే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పలిన్ పట్టాలతో కప్పుకోవాలని సూచించింది.