అత్యవసరమైతే 100 కు డయల్ చేయండి: జిల్లా ఎస్పీ

BDK: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.