'విద్యార్థులందరూ పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలి'

NLR: విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో విడవలూరు గ్రామంలోని గ్రంథాలయంలో జరిగే వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లైబ్రేరియన్ నిరూప తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులందరూ పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలన్నారు. పుస్తకాలను చదవడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు. బుధవారం విద్యార్థులకు పుస్తక పఠనంపై శిక్షణ ఇచ్చారు.