ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎంపికకు మార్గదర్శకాల జారీ

ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎంపికకు మార్గదర్శకాల జారీ

కర్నూలు జిల్లా స్థాయి గేమ్స్ సెక్రటరీ పోస్టుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రకటన విడుదల చేశారు. 2025-26, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆసక్తి ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు ఈనెల 4వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని చెప్పారు.