'స్థానిక సంస్థల నుంచే బీసీల రాజ్యాధికారానికి పునాది'
BDK: పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ఐక్యతకు ప్రతీకగా ఘన సన్మాన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులను పద్మశాలి భవనంలో శాలువాలతో సత్కరించారు.