మారంరెడ్డిపల్లిలో పర్యటించిన కలెక్టర్
NLR: సీతారాంపురం మండలం మారంరెడ్డిపల్లిలో కలెక్టర్ హిమాన్షు శుక్ల 'పల్లె వీక్షణ' చేపట్టారు. వదలకుంట చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన ఆయన, అంగన్వాడీ, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల సేవలను అభినందించారు. సచివాలయంలో ప్రజల అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. నీటి ఎద్దడి నివారణకు కొత్త ప్రాజెక్టులు చేపడతామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.