బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. మహిళకు తీవ్రగాయాలు
ASF: కాగజ్ నగర్ పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బురదగూడ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.