పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

NZB: నందిపేట్ మండలం చిమ్రాజ్ పల్లి గ్రామ ప్రజలకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం పలు అంశాలపై అవగాహన కల్పించారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నియమాలు, షీ టీమ్స్ గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 100, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ అంశాలపై అవగాహన కల్పించారు.