'మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి'
PPM: మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో డ్రగ్స్, గంజాయి నివారణపై మైకు ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందుకోసం ప్రతీ 10 ఇళ్లకు ఒక వాలంటీరును ఏర్పాటుచేసుకొని ప్రచారం నిర్వహించాలని సూచించారు.