సబ్ జైలును సందర్శించిన జడ్జి

ELR: చింతలపూడి మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధు బాబు శుక్రవారం చింతలపూడిలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిందితులతో మాట్లాడి వారి కేసుల వివరాలు, వారికి అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని నిందితులకు అందే న్యాయ సహాయం గురించి కూడా ఆరా తీశారు.