వైసీపీ సీనియర్ నేత ఉత్తమ్ రెడ్డికి మక్బూల్ నివాళి
సత్యసాయి: తలుపుల మండలం అక్కసానిపల్లికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు ఉత్తమ్ రెడ్డి మృతి పట్ల కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, శివారెడ్డి, సురేంద్ర రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.