VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

NLG: దేవరకొండ పట్టణ సమీపంలోని ఉప్పు వాగు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 10వ తరగతి చదువుతున్న శ్రీనివాస చారి, కార్తికేయన్ అనే విద్యార్థులు హోలీ ఆడేందుకు వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. స్థానికులు దేవరకొండ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.