జన్నారం నూతన ఎస్సైగా అనూష నియామకం
MNCL: జన్నారం మండల నూతన ఎస్సైగా అనూషను నియమించినట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్, కమిషనర్ అంబారి కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జన్నారం ఇంత కాలంగా పనిచేసిన గుండేటి రాజ వర్ధన్ వీఆర్ పై బదిలీ వెళ్ళినట్లు వారు తెలిపారు. అనుష చొప్పదండి నుంచి జన్నారం బదిలీ అయ్యారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.