ఈరోజు నుంచే సర్వీసులన్నీ పునరుద్ధరించాం: ఇండిగో
విమానాల రద్దు కారణంగా ఇబ్బందులు పడిన వేల మంది ప్రయాణికులకు ఆ సంస్థ CEO క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం తమ సర్వీసులు గాడినపడ్డాయని, ఈరోజు నుంచే సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రయాణాలు రద్దైనవారికి మొత్తం డబ్బు రీఫండ్ చేస్తున్నామన్నారు. సేవల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నిన్న 1800 విమాన సర్వీసులు నడిపామని స్పష్టం చేశారు.