న్యాయం చేయాలి అంటూ దివ్యాంగుల నిరసన

ELR: అర్హులైనప్పటికీ తమను ప్రభుత్వ పెన్షన్ మంజూరు దారుల లిస్టు నుంచి తొలగించారంటూ కొందరు దివ్యాంగులు గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 90 శాతానికి పైగా వికలాంగత్వం కలిగినప్పటికీ తొలగించడం పట్లవారు ఎంపీడీవోకి వినతి పత్రాలు సమర్పించారు. విచారణ నేపథ్యంలో వచ్చిన సిబ్బంది అధికారులు తప్పిదాల వలన తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని వాపోయారు.