'ఈ నెలాఖరులోగా 2వేల ఇళ్లు పూర్తి చేయండి'

VZM: ఈ నెలాఖరు లోగా జిల్లాలో 2 వేల గృహాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం అధికారులతో వెబెక్స్ ద్వారా గృహ నిర్మాణాలపై సమీక్షించారు. ప్రస్తుతం రూఫ్ లెవెల్‌లో ఉన్న 2 వేల గృహాలను నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని MPDO లకు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో 72,496 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు.