గొర్లవీడులో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
BHPL: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం స్థానిక శివాలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు హోమాలు కాల్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.