గోరుకల్లు జలాశయంకు మరమ్మతులు

గోరుకల్లు జలాశయంకు మరమ్మతులు

KRNL: గోరుకల్లు జలాశయం కట్ట పటిష్ఠతకు రూ.53 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం నిర్వహణ చేపట్టక కట్ట కుంగింది. దీంతో స్థానికులు సమస్యను స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి తెలపగా ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.99 కోట్లు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కట్ట ఎత్తు 261 మీ.లు కాగా, దానిని 265.40 మీటర్లకు పెంచనున్నారు.