ఆసక్తి రేకెత్తించేలా శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్

ఆసక్తి రేకెత్తించేలా శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్

హీరో శర్వానంద్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబోలో 'బైకర్' మూవీ తెరకెక్కుతుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.