తెనాలిలో మహిళ హత్య.. నిందితుడు అరెస్ట్

GNTR: తెనాలి ఇస్లాంపేట కాలువ కట్ట రోడ్డలో గురువారం జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు మణిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. తమిళనాడుకు చెందిన మణి ఇటీవల తెనాలి వచ్చి కూలీ పనులు చేసుకుంటుండగా భిక్షాటన చేసుకునే మహిళ పరిచయమైంది. 15వ తేదీ రాత్రి ఇద్దరు మద్యం సేవిస్తుండగా జరిగిన ఘర్షణలో మణి దాడి చేయడంతో మహిళ మృతిచెందింది.