ప్రమాదల నివారణకు బోర్డులు ఏర్పాటు

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు సూచిక బోర్డులను సిద్ధం చేశారు. ప్రమాదాలను ఎక్కువగా జరిగే ప్రాంతాలనుముందుగా గుర్తించి వాటిని ఏర్పాటు చేస్తామని సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంవలన ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.