VIDEO: మెగా సిటీగా మారనున్న విశాఖ నగరం
విశాఖ నగరాన్ని అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించి మెగా సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విస్తరణలో భాగంగా, 90 కిలోమీటర్ల పొడవైన సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ కసరత్తు ప్రారంభించింది. ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టును త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.