భార్యాభర్తల అదృశ్యంపై కేసు నమోదు

భార్యాభర్తల అదృశ్యంపై కేసు నమోదు

JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన బోడ రవి(50), బోడ ప్రమీల(45) అనే దంపతులిద్దరూ అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఈనెల 16న ఇంట్లో నుంచి వెళ్లినవారు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని వారి కూతురు అంబటి మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వారి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.