'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోండి'
CTR: విద్యార్థులు పాఠశాల దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు అన్నారు. ఈ మేరకు వాటిని సాధించేందుకు పట్టుదలతో నిరంతరం శ్రమించాలన్నారు. గుడిపాల మండలం నరహరిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విద్యే బాలల భవిష్యత్తుకు మార్గం అని విద్యార్థులను ప్రోత్సహించారు.