ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
SKLM: సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురంలోని ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు. అలాగే ఇప్పటివరకు కొనుగోలు జరిగిన డేటాను కంప్యూటర్లో పరిశీలించారు.