'రెండవ విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
BDK: రేపు జరగనున్న 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం తెలిపారు. 7 మండలాల్లో 138 గ్రామపంచాయతీలకు సర్పంచ్, 1006 వార్డులకు ఉదయం 7 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 1,392 పోలింగ్ కేంద్రాల్లో 2,11,892 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అని తెలిపారు.