చిరంజీవితో ఫెడరేషన్ సభ్యుల భేటీ

ఫిల్మ్ చాంబర్‌లో సినీ నిర్మాతలు సమావేశం నిర్వహించారు. కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. వల్లభనేని అనిల్, అమ్మిరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫెడరేషన్ సభ్యులు వారి సమస్యలను చిరంజీవికి వివరిస్తున్నారు.