'స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కుట్రకు జగనే తెరలేపారు'
AP: జగన్ ప్రాక్టీస్ చేసిన అబద్ధాలు బాగా అప్పచెప్పారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనే కుట్రకు జగనే తెరలేపారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసి స్థిరాస్తి వ్యాపారం చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.