వినాయకపల్లి పంచాయతీ కార్యదర్శిగా ప్రేమ్ కుమార్

VZM: ఎస్ కోట మండలం ఎస్‌జి పేట సచివాలయం పరిధిలోని వినాయకపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎస్ ప్రేమ్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన డెంకాడ మండలం చల్లపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని, ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు.