వంగపహాడ్‌లో ఉద్రిక్తత

వంగపహాడ్‌లో ఉద్రిక్తత

HNK: హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో పాత కక్షలతో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గం ఇంట్లో లేని సమయంలో మరో వర్గం దాడి చేయడంతో కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కర్రలు, బండలతో జరిగిన దాడిలో మహిళలపైనా దౌర్జన్యం జరిగింది. ఇళ్లకు, వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.