VIDEO: నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పరిశీలించారు. ఈ మేరకు వారు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా కృషి చేయాలన్నారు.