ఉత్తమ PACSగా వీరపనేనిగూడెం PACS

కృష్ణా: గన్నవరం మండలంలోని వీరపనేనిగూడెం PACS రాష్ట్రంలో ఉత్తమ PACSగా నిలిచి ఆప్కాబ్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు చేతుల మీదుగా PACS అధ్యక్షుడు జొన్నలగడ్డ దేవరయ్య (తాతారావు), బ్యాంకు సెక్రటరీ వడ్లమూడి అశోక్ కుమార్‌లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.