యువ ప్రో కబడ్డీ లీగ్‌లోని జట్టుకు కోచ్‌గా ప్రశాంత్

NZB: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 హైదరాబాద్‌లో యువ ప్రోకబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. కాగా ‘శాతవాహన సైనిక’ జట్టుకు చీఫ్ కోచ్‌గా జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ నియామకమయ్యారు.