'అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి'

'అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి'

సూర్యాపేటలో ఉన్న 96 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.