పుట్టపర్తిలో వంటశాలను పరిశీలించిన రత్నాకర్

పుట్టపర్తిలో వంటశాలను పరిశీలించిన రత్నాకర్

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ వంటశాలను సందర్శించారు. భక్తులకు రుచికరమైన భోజనం అందించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. అన్నదాన కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.