చెరువులో చేప పిల్లలు పంపిణీ చేసిన నాయకులు

చెరువులో చేప పిల్లలు పంపిణీ చేసిన నాయకులు

NRPT: గుండుమాల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో తెలంగాణ ప్రభుత్వం తరఫున 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లాభం జరుగుతుందని, చేపల ఉత్పత్తి పెంపుతో జీవనోపాధి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.