త్వరలో జిల్లాకు సీఎం రేవంత్ రాక
BDK: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. మంగళవారం ముఖ్యమంత్రిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు.