BREAKING: 18 మంది మృతి
రాజస్థాన్‌లో ఫలోడి-బికనీర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఆగి ఉన్న టెంపోను వేగంగా వచ్చి లారీ ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.