ప్రధానిని కలిసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా NDA బలపరిచిన C.P రాధాకృష్ణన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు NDA కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, పార్టీల మద్దతు, ఎన్నికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.