'కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి'

'కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి'

SRD: కార్ల్ మార్క్స్ చూపిన మార్గంలో కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని కేకే భవన్‌లో ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కార్ల్ మార్క్స్ చూపిన మార్గమే మానవతా సిద్ధాంతమని చెప్పారు.