మండలంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు: సీపీఎం

GDWL: ధరూరు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ధరూర్‌లో స్థానిక సమస్యలపై సీపీఎం సర్వేను ప్రారంభించింది. మండలంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపై నిలిచి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన తెలిపారు.