సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు సోమవారం పర్యటించారు. కార్తీక మాసం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.