ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

గుంటూరు: ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్ (35) దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారు చేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్య కు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడులోని జగనన్న కాలనీ వద్దకు తీసుకుపోయి మద్యం తాగించి కొట్టి చంపేశారు.