కిష్టగూడెంలో చలివేంద్రం ఏర్పాటు
JN: లింగాల గణపురం మండలంలోని కిష్టగూడెంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ.. వేసవికాలంలో బాటసారులా దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.