VIDEO: చిట్టేడు వద్ద మరో ప్రమాదం.. తిరగబడిన ఆటో
TPT: కోట మండలం, చిట్టేడు -కేశవరం వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు నుంచి వస్తున్న ఆటో కేశవరం దాటగానే ప్రమాదవశాత్తు తిరగబడింది. అదృష్టవశాత్తు ఆటోలో ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇదే స్పాట్లో మంగళవారం ఆటో బైక్ ఢీకొని మహిళ మృతి చెందింది.