'అవసరమైన మేర యూరియా పంపిణీ'

CTR: సోమల మండలంలో యూరియా పంపిణీని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ క్రిష్ణ, సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ తనిఖీ చేశారు. వారు రైతులతో మాట్లాడుతూ.. ఎవ్వరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల వివరాలు, ఇప్పుడు తీసుకుంటున్న యూరియా ఏ పంటలకు వేస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు.