కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పునఃప్రారంభం

కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పునఃప్రారంభం

SS: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో పునరుద్ధరించారు. బుధవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ స్టేషన్‌ను ప్రారంభించారు. సీఎస్ఆర్, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.25 లక్షల వ్యయంతో దీనిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 13 పంచాయతీల పరిధిలోని 75 గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.