ఏప్రిల్ 1న త్రిపురాంతకేశ్వర స్వామి గిరిప్రదక్షిణ
ప్రకాశం: త్రిపురాంతకేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏప్రిల్ 1న జరగనుంది. ఈ నేపథ్యంలో గోడపత్రికలు బాలాత్రిపుర సుందరీదేవి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆలయ అధికారులు ఆవిష్కరించారు. ఈవో డీ. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి నెలా పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాటు చేస్తామన్నారు.