నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సెలింగ్
HYD: ప్రొ. జయశంకర్ TG వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, PV నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సెలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా UG కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.