పదో తరగతి పరీక్షకు 99.73% మంది హాజరు
నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 99.73 శాతం మంది హాజరయ్యారని డీఈవో తెలిపారు. మొత్తం 106 పరీక్షా కేంద్రాల్లో 19,718 మంది రావల్సి ఉండగా 19,664 మంది పరీక్ష రాశారు. పరీక్షకు 54, ప్రైవేట్ విద్యార్థులు 24 మందికి 7 గురు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష ఎలాంటి ఇబ్బందులు లేకుండ ప్రశాంతంగా జరిగిందని డీఈవో వెల్లడించారు.